అంతరిక్షంలో తప్పిన ముప్పు

అంతరిక్షంలో తప్పిన ముప్పు
  • సమీపంలో నుంచి దూసుకెళ్లిన అమెరికా, రష్యాల శాటిలైట్లు  

వాషింగ్టన్: అంతరిక్షంలో ప్రమాదం తప్పింది. అమెరికా, రష్యా శాటిలైట్లు ఒకదానికొకటి చాలా దగ్గరగా రాగా.. కొంచెంలో కొలిజన్ తప్పింది. అవి రెండు అత్యంత సమీపం నుంచి దూసుకెళ్లడంతో నాసా ఊపిరి పీల్చుకుంది. అమెరికాకు చెందిన టైమ్డ్ మిషన్ శాటిలైట్, రష్యాకు చెందిన కాస్మోస్ 2221 శాటిలైట్ చాలా దగ్గరగా వస్తున్నాయని అంతకుముందు నాసా తెలిపింది.

 ‘‘భూమికి 600 కిలోమీటర్ల దూరంలో రెండు శాటిలైట్స్ ఉన్నాయి. అవి బుధవారం తెల్లవారుజామున ఢీకొనే ప్రమాదం ఉంది. అదే జరిగితే అంతరిక్షంలో పెద్ద ఎత్తున వ్యర్థాలు పోగుపడతాయి. భవిష్యత్తులో స్పేస్ మిషన్స్ చేపట్టేందుకు ఇబ్బందులు ఎదురవుతాయి. శాటిలైట్స్ పక్కపక్కన వెళ్తాయని, ఢీకొనే అవకాశం ఉండకపోవచ్చని భావిస్తున్నం. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నం” అని సోషల్ మీడియా ‘ఎక్స్’లో నాసా పోస్టు పెట్టింది. కాగా, భూవాతావరణాన్ని తెలుసుకునేందుకు టైమ్డ్ మిషన్ శాటిలైట్​ను అమెరికా స్పేస్ లోకి పంపించింది.