
- చేరదీసిన గాంధీ హాస్పిటల్ సెక్యూరిటీ సిబ్బంది
పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ గాంధీ దవాఖానలో శుక్రవారం మధ్యాహ్నం ఓ చిన్నారి తప్పిపోయింది. దాదాపు మూడేండ్ల వయసు కలిగి ఉన్న పాప ఒంటరిగా ఏడుస్తూ గాంధీ ఆవరణలో కన్పించింది. దీంతో సెక్యూరిటీ సిబ్బంది చేరదీసి, అన్నం పెట్టారు.
పాపను పేరు అడగగా, కార్తిక అని చెబుతోంది. ఇతర వివరాలు చెప్పడం లేదని సెక్యూరిటీ ఇంచార్జ్ తెలిపారు. కాగా, చిన్నారిని ఆమె తల్లి విడిచి పెట్టి వెళ్లిపోయినట్లు భావిస్తున్నారు. బహుశా తల్లికి మతిస్తిమితం లేకపోయి ఉండొచ్చని సిబ్బంది అభిప్రాయపడుతున్నారు. చిన్నారి పాప తమ చెంత ఉందని చిలకలగూడ పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు సెక్యూరిటీ సిబ్బంది తెలిపారు.