
కరోనా సోకిన వ్యక్తి కనిపించకుండాపోయిన ఘటన హైదరాబాద్‌లో జరిగింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పంచముఖి హనుమాన్ కాలనీలో నివాసం ఉండే 60 సంవత్సరాల వృద్ధుడికి కరోనా సోకింది. వృద్ధుడి గురించి వైద్య శాఖ అధికారులు సమాచారం ఇవ్వడంతో వైద్యులు, పోలీసులు కాలనిలో సర్వే చేపట్టారు. బాధితుడికి చెందిన ప్రైమరీ కాంటాక్టులపై అధికారులు ఆరా తీస్తున్నారు. దగ్గు, జ్వరం, జలుబు లక్షణాలు ఉండటంతో ఆ వృద్ధుడు హైదరాబాద్ వెళ్లి పరీక్షలు చేయించుకున్నాడు. అతనికి కరోనా సోకినట్లు బుధవారం రాత్రి వైద్య ఆరోగ్య శాఖ దృవీకరించింది. అయితే బాధితుడు హైదరాబాద్‌లో కనిపించకపోవడంతో రాష్ట్ర వైద్య శాఖ అధికారులు జిల్లా అధికారులకు సమాచారం ఇచ్చారు. దాంతో వైరస్ బాధితునికి సంబంధించిన 13 మంది కుటుంబ సభ్యులను అధికారులు హోంక్వారంటైన్‌లో ఉంచారు.
For More News..