
నిర్మాణం దశలోనే బయటపడ్డ లీకేజీలు
సందిగ్దంలో అధికారులు
మిషన్ భగీరథ పనుల్లో నాణ్యతా లోపాలు బట్టబయలవుతున్నాయి. టెస్టింగ్ దశలోనే లోపాలు వెలుగుచూస్తున్నాయి. మీర్ పేట్ మున్సిపాలిటీ పెద్ద చెరువు పక్కన నిర్మిస్తున్న 500 కేఎల్ సామర్ధ్యం గల ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంక్‌లో ఆదివారం అధికారులు నీటిని నిల్వచేసి టెస్టింగ్ నిర్వహించారు. అందరూ చూస్తుండగానే ట్యాంక్ చుట్టూ 12 చోట్ల లీకేజీలు ఏర్పడి నీరు కిందకు పడుతుండడాన్ని చూసి అధికారులు, స్థానికులు అవాక్కయ్యారు. రెండు మూడు చోట్ల పెద్ద ఎత్తున లీకేజీలు ఉండడం గమనార్హం.
అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా, కాంట్రాక్టర్ నాణ్యతాప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఓవర్ హెడ్ ట్యాంక్‌కు లీకేజీలు ఏర్పడ్డాయని స్థానికులు తెలిపారు. ప్రారంభానికి ముందే ఇంతటి పరిస్థితులు ఉంటే ఓవర్ హెడ్ ట్యాంక్ ఇంకా ఎంతకాలం మనుగడలో ఉంటుందని ప్రశ్నిస్తున్నారు.
లీకేజీలు కావు నెమ్ము మాత్రమే
ఓవర్ హెడ్ ట్యాంక్ టెస్టింగ్ లో కనిపించే వి వాటర్ లీకేజీలు కావు. కొత్త ట్యాంక్ లో చెమ్మలు రావడం సహజం. అక్కడక్కడ చిన్న పాటి లీకేజీలు కూడా కామన్ గా ఉంటాయి. – ఉదయ్ , అసిస్టెం ట్ ఇంజినీర్, వాటర్ వర్క్స్ బోర్డు