కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లోని పలు మండలాల్లో 4 రోజుల పాటు మిషన్‌భగీరథ నీటి సప్లయ్‌లో అంతరాయం ఏర్పడుతుందని మిషన్ భగీరథ గ్రిడ్ ఈఈ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మల్లుపేట వద్ద మెయిన్ పైపులైన్రిపేర్కారణంగా ఈ నెల 11, 12, 13, 14 తేదీల్లో కామారెడ్డి, మాచారెడ్డి, భిక్కనూరు, బీబీపేట, దోమకొండ, రాజంపేట, రామారెడ్డి, గాంధారి, సదాశివనగర్, తాడ్వాయి మండలాల్లోని గ్రామాలకు నీటి సప్లయ్నిలిచిపోతుందన్నారు. కామారెడ్డి మున్సిపాలిటీకి మిషన్‌భగీరథ నీళ్లు రోజు విడిచి రోజు సప్లయ్చేస్తామని తెలిపారు.
