తొలి టెస్టులో బ్యాటింగ్ లో రాణించిన న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌

తొలి టెస్టులో బ్యాటింగ్ లో  రాణించిన న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌


బులవాయో: జింబాబ్వేతో జరుగుతున్న తొలి టెస్ట్‌‌‌‌‌‌‌‌లో న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌లో రాణించింది. డేవన్‌‌‌‌‌‌‌‌ కాన్వే (88), డారిల్‌‌‌‌‌‌‌‌ మిచెల్‌‌‌‌‌‌‌‌ (80) చెలరేగడంతో.. 92/0 ఓవర్‌‌‌‌‌‌‌‌నైట్‌‌‌‌‌‌‌‌ స్కోరుతో గురువారం రెండో రోజు ఆట కొనసాగించిన కివీస్‌‌‌‌‌‌‌‌ తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో 96.1 ఓవర్లలో 307 రన్స్‌‌‌‌‌‌‌‌కు ఆలౌటైంది. దీంతో 158 రన్స్‌‌‌‌‌‌‌‌ తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ ఆధిక్యం లభించింది. 

విల్‌‌‌‌‌‌‌‌ యంగ్‌‌‌‌‌‌‌‌ (41), హెన్రీ నికోల్స్‌‌‌‌‌‌‌‌ (34), నేథన్‌‌‌‌‌‌‌‌ స్మిత్‌‌‌‌‌‌‌‌ (22) ఫర్వాలేదనిపించారు. ముజురబానీ 3, తనక చివాంగ 2 వికెట్లు తీశారు. తర్వాత రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ మొదలుపెట్టిన జింబాబ్వే ఆట ముగిసే టైమ్‌‌‌‌‌‌‌‌కు 13 ఓవర్లలో 31/2 స్కోరు చేసింది. నిక్‌‌‌‌‌‌‌‌ వెల్చ్‌‌‌‌‌‌‌‌ (2 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌), విన్సెంట్‌‌‌‌‌‌‌‌ మసకెస (0 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌) క్రీజులో ఉన్నారు. బియాన్‌‌‌‌‌‌‌‌ బెన్నెట్‌‌‌‌‌‌‌‌ (18), బెన్‌‌‌‌‌‌‌‌ కరన్‌‌‌‌‌‌‌‌ (11) నిరాశపర్చారు.