వేర్వేరు టీకాలను కలిపి తీసుకోవచ్చా?

వేర్వేరు టీకాలను కలిపి తీసుకోవచ్చా?

న్యూఢిల్లీ: తొలి డోస్ గా ఒక టీకాను, రెండో డోస్ గా మరో వ్యాక్సిన్ ను ఇవ్వడం సాధ్యమా అనే విషయంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఇది సాధ్యమేనని, కానీ ఈ దిశగా టీకాలు ఇవ్వమని ఇప్పుడే ఆదేశించలేమని సర్కార్ తెలిపింది. దీనికి మరికొంత సమయం పడుతుందని స్పష్టం చేసింది.

'వేర్వేరు టీకాలను కలిపి తీసుకోవడం సాధ్యమే. తొలి డోసు యాంటీ బాడీలను పెంచుతుంది. రెండో డోసుతో యాంటీ బాడీలు మరింతగా ఉత్పత్తి అవుతాయి. కానీ ఈ దిశగా మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉంది. ఇది శాస్త్రీయంగా నిరూపితం కావాల్సి ఉంది. ఇది సాధ్యమేనా కాదనేది కాలమే నిర్ణయిస్తుంది. ఇంటర్నేషనల్ స్టడీస్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పరిశోధనల మీద ఇది ఆధారపడి ఉంది' అని నీతి అయోగ్ సభ్యుడు వీకే పాల్ పేర్కొన్నారు. అయితే ఇలా వేర్వేరు వ్యాక్సిన్ లు తీసుకుంటే పలు దుష్ప్రభావాలు వచ్చే ప్రమాదం ఉందని యూకేలో నిర్వహించిన ఓ స్టడీలో తేలింది.