మియాపూర్‌‌లో పనిచేస్తున్న ఇంటికి కన్నం .. మహిళ అరెస్ట్

మియాపూర్‌‌లో పనిచేస్తున్న ఇంటికి కన్నం .. మహిళ అరెస్ట్

మియాపూర్, వెలుగు: పనిచేస్తున్న ఇంట్లో దొంగతనానికి పాల్పడిన ఓ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. మియాపూర్ మైత్రి నగర్ ఫేస్ 2లోని ఓ అపార్ట్​మెంట్​లో ఐటీ ఉద్యోగి కృష్ణ కార్తీక్ తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. వీరి ఇంట్లో అల్విన్ కాలనీకి చెందిన లక్ష్మి గత పదేండ్లుగా హౌస్ మేడ్​గా పనిచేస్తుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బీరువాలో ఉన్న 90 గ్రాముల బంగారం, 77 గ్రాముల వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లింది. 

ఆ తర్వాత వాటిని నారాయణఖేడ్ లోని ఓ జువెలరీ  షాప్ లో అమ్మేందుకు ప్రయత్నించగా, షాప్ యజమాని స్థానిక పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో ఆమెను వారు అదుపులోకి తీసుకొని, మియాపూర్ పోలీసులకు అప్పగించారు. అనంతరం బాధితుడు కార్తీక్ ఫిర్యాదుతో లక్ష్మిని అరెస్ట్ చేశారు.