మంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న ఉదయనిధి స్టాలిన్

మంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న ఉదయనిధి స్టాలిన్

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తనయుడు ఉదయనిధి రేపు (బుధవారం) మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ విషయాన్ని రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. బుధవారం ఉదయం 9 గంటల 30 నిమిషాలకు ఉదయనిధి ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఉదయనిధికి మంత్రి పదవి లభించనుంది. డీఎంకే అధికారంలోకి వచ్చిన సంవత్సరం తర్వాత ముఖ్యమంత్రి స్టాలిన్ మంత్రివర్గ విస్తరణ చేయడం ఇదే తొలిసారి.

45 ఏళ్ల ఉదయనిధి స్టాలిన్..గతంలో తన తాత కరుణానిధికి చెందిన చేపాక్ తిరువల్లికేణి నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఉదయనిధి ప్రస్తుతం పార్టీ యువజన విభాగానికి నేతృత్వం వహిస్తున్నారు. ఆయనకు యువజన సంక్షేమ, క్రీడాశాఖ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది.