నేరడిగొండ, వెలుగు: ఆర్గానిక్ పంటలు ఆరోగ్యానికి మేలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. ఆదివారం ఆదిలాబాద్జిల్లా నేరడిగొండ మండల కేంద్రంలో ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వర్షాధార ప్రాంత అభివృద్ధిపై రైతులకు శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ.. రైతులు ఆర్గానిక్ ఎరువులు వాడి పంటలు పండిస్తే ప్రజలకు వ్యాధులు రాకుండా ఉంటాయన్నారు. ఆర్గానిక్ ఫార్మింగ్ పై అవగాహన కల్పించేందుకే రైతులకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
జిల్లాలో 540 మందికి ఈ పథకం అమలు చేస్తామని వెల్లడించారు. అనంతరం రైతులకు టార్ఫాలిన్ కవర్లు , ప్లాస్టిక్ ట్రే లను అందజేశారు. మండల కేంద్రంలో నిర్వహించే మెగా క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, ఆత్మ డైరెక్టర్ శంకర్, నేరడిగొండ ఉప సర్పంచ్ గులాబ్ సింగ్, దేవేందర్ రెడ్డి, సాబ్లే సంతోష్, రాథోడ్ సురేందర్, రైతులు పాల్గొన్నారు.
