నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే.. నా భార్య ఆత్మహత్య చేసుకుంటుంది : సీఎంని బెదిరించిన లీడర్

నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే.. నా భార్య ఆత్మహత్య చేసుకుంటుంది : సీఎంని బెదిరించిన లీడర్

రాను రాను రాజకీయాలు ట్రెండ్ కు తగ్గట్లు మారిపోతున్నాయి. ఒకప్పుడు ఎమ్మెల్యే టికెట్ కోసం, మంత్రి పదవి కోసం  పైరవీలు, బ్రతిమిలాడటాలు చేసి పొందేవారు. కానీ ఇప్పుడు బెదిరించి టికెట్లు, మంత్రి పదవులు దక్కించుకోవాలని చూస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే మహారాష్ట్రలో చోటు చేసుకుంది.

మహారాష్ట్ర కేబినెట్ బెర్తు కోసం ముగ్గురు ఎమ్మెల్యేలు సీఎం ఏక్ నాథ్ షిండేను బెదిరించారని శివసేన (ఏక్ నాథ్ షిండే వర్గం) ఎమ్మెల్యే భరత్ షేత్ గోగావాలే సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర మంత్రి వర్గ విస్తరణలో  ముగ్గురు ఎమ్మెల్యేల్లో  ఒకరు తనకు మంత్రి పదవి ఇవ్వకుంటే తన భార్య ఆత్మహత్య చేసుకుంటుందంటూ సీఎం ఏక్ నాథ్ షిండేను బ్లాక్ బెయిల్ చేసి మంత్రి పదవి దక్కించుకున్నారని   భరత్ గోగావాలే వ్యాఖ్యానించారు. ఓ ఎమ్మెల్యే అయితే మంత్రి పదవి దక్కకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రభుత్వం నుంచి వైదొలుగుతానని  చెప్పినట్లు మంత్రి అయినట్లు గుర్తు చేశారు. అలాగే ఓ ఎమ్మెల్యే అయితే తాను మంత్రి కాకపోతే తన నియోజకవర్గంలో తన నియోజకవర్గంలో కేంద్రమంత్రి నారాయణ్ రాణే తనను రాజకీయంగా అంతం చేస్తారని..అందుకే తనకు కచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలని పట్టుబట్టి దక్కించుకున్నట్లు వెల్లడించారు. వీరి కారణంగా మంత్రి పదవి పొందాల్సిన తాను..ఇప్పటికీ వెయిటింగ్ లిస్టులో ఉన్నానని భరత్ గోగావాలే చెప్పుకొచ్చారు. ఈ మూడు సందర్భాల్లో సీఎం ఏక్ నాథ్ షిండే తనను బుజ్జగించారని వెల్లడించారు. 

మహారాష్ట్రలో ప్రతీ సారి మంత్రి వర్గ విస్తరణ జరిగినప్పుడు తాను ఆశలు పెట్టుకుంటున్నాని.. భరత్ గోగావాలే తెలిపారు. ఇటీవలే అజిత్ పవార్, ఆయన వర్గం ఎమ్మెల్యేలు కూడా మంత్రులుగా ప్రమాణం చేసిన సమయంలో తాను కూడా మంత్రిగా ప్రమాణం చేస్తానని సీఎం ఏక్ నాథ్ షిండేకు చెప్పినట్లు ఎమ్మెల్యే భరత్ గోగావాలే చెప్పారు. కానీ తనను పట్టించుకోలేదన్నారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేసేవారికి పదవులు దక్కుతున్నాయని భరత్ గోగావాలే ఆరోపించారు. ప్రస్తుతం ఎమ్మెల్యే భరత్ గోగావాలే వ్యాఖ్యలు మహారాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి.