ఖానాపూర్ అభివృద్ధే ప్రధాన లక్ష్యం : ఎమ్మెల్యే బొజ్జు పటేల్

ఖానాపూర్ అభివృద్ధే ప్రధాన లక్ష్యం : ఎమ్మెల్యే బొజ్జు పటేల్

ఖానాపూర్, వెలుగు: ఖానాపూర్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన ప్రధాన కర్తవ్యమని ఎమ్మెల్యే బొజ్జు పటేల్ అన్నారు. ఖానాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 11,12వ వార్డుల్లో నిర్మిస్తున్న సిమెంట్ రోడ్డు, మురికి కాలువల నిర్మాణాలతో పాటు డబుల్ బెడ్రూం కాలనీలో రూ.1.40 కోట్లతో నిర్మిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణానికి బుధవారం ఆయన భూమి పూజ చేశారు. 

ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాల్లో మాట్లాడుతూ.. కాంగ్రెస్  అధికారంలోకి వచ్చాక పట్టణాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు. పట్టణంలోని తెలంగాణ తల్లి చౌరస్తా నుంచి పోలీస్ స్టేషన్, మస్కాపూర్ శివారు వరకు రోడ్డు వెడల్పు పనులు త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. నిరుద్యోగుల కోసం ఖానాపూర్ లో మోడల్ లైబ్రరీని కూడా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. 

ఇందిర మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా ఎంపీపీ కార్యాలయంలో మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అబ్దుల్ మాజీద్, ఆత్మ చైర్మన్ తోట సత్యం, మున్సిపల్ మాజీ చైర్మన్లు చిన్నం సత్యం, అంకం రాజేందర్, కాంగ్రెస్ మండల, పట్టణ అధ్యక్షులు దయానంద్, రమేశ్, నాయకులు యూసుఫ్ ఖాన్, జహీర్, షబ్బీర్ పాషా, అమానుల్లా ఖాన్, కావలి సంతోష్, గంగ నర్సయ్య, శ్యామ్ మోహన్ రావ్ తదితరులు పాల్గొన్నారు.