హమాలీ బస్తీలో అభివృద్ధిని పట్టించుకోరా?

హమాలీ బస్తీలో అభివృద్ధిని పట్టించుకోరా?
  • సనత్ నగర్ సెగ్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోట నీలిమ

 సికింద్రాబాద్, వెలుగు : సిటీలో అభివృద్ధి జరుగుతున్నది నిజమైతే పద్మారావునగర్​లో రోడ్లు, హమాలీ బస్తీ ఇంకా ఎందుకు అధ్వానంగా ఉన్నాయని సనత్ నగర్ సెగ్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కోట నీలిమ ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆమె కాంగ్రెస్ నేతలతో కలిసి ర్యాలీలు చేపట్టారు. ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. సనత్​నగర్ సెగ్మెంట్ వాసులు నీలిమ ప్రచారానికి బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... కేసీఆర్ కుటుంబానికి ఇయ్యాల లక్షల కోట్లు ఎలా వచ్చాయో చెప్పాలన్నారు.

తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయనుకున్న యువత ఆశలపై కేసీఆర్ నీళ్లు చల్లారన్నారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో జనాలకు ఒరిగిందేమీ లేదన్నారు. తెలంగాణ సాధించింది ఇందుకేనా? అని ఆమె ప్రశ్నించారు. సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు. హస్తం గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని ఆమె కోరారు.