ఎన్టీఆర్ ఇంటికొచ్చి.. ఆయన తల్లికి క్షమాపణ చెప్పాలి : ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్కు ఫ్యాన్స్ వార్నింగ్

ఎన్టీఆర్ ఇంటికొచ్చి.. ఆయన తల్లికి క్షమాపణ చెప్పాలి : ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్కు ఫ్యాన్స్ వార్నింగ్

ఎన్టీఆర్ నటించిన వార్-2 సినిమాపై, అనంతపురం TDPఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు వివాదమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ తగ్గేదేలే అంటూ సోషల్ మీడియాలో హెచ్చరిక జారీ చేశారు. తమ అభిమాన హీరో ఎన్టీఆర్ సినిమాలకి ఇబ్బంది పెడితే అస్సలు ఊరుకునేదే లేదని, తక్షణమే ఆయన తల్లికి బహిరంగ క్షమాపణ చెప్పాలని స్పష్టం చేశారు.

‘TDP నాయకులు పదే పదే జూనియర్ ఎన్టీఆర్ని దుర్భాషలాడటం, ఆయన సినిమాలకి ఇబ్బంది పెట్టడం అలవాటుగా మార్చుకున్నారు. కానీ, ఈ  సారి ఆ అలవాటు మితిమీరిన హద్దులు దాటింది. నారా భువనేశ్వరికి జరిగిన అన్యాయానికి రాష్ట్రాన్ని ఊపేసిన తెదేపా నాయకత్వం, ఇవాళ ఎన్టీఆర్ పై జరిగితే ఎందుకు మౌనం పాటిస్తుందని గుర్తుచేశారు.

TDPపార్టీకి ఏ మాత్రం విలువలు ఉన్నా, తక్షణమే దగ్గుపాటి ప్రసాద్ను పార్టీ విధుల నుంచి తొలగించాలని ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిమాండ్ చేశారు. అంతేకాకుండా.. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ను హైదరాబాద్ లోని ఎన్టీఆర్ గారి నివాసానికి వచ్చి వారికి, వారి తల్లికి బహిరంగ క్షమాపణ చెప్పాలని సూచించారు’. ప్రస్తుతం ఎన్టీఆర్ ఫ్యాన్స్ జారీ చేసిన హెచ్చరిక సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ క్రమంలో TDP నాయకులు ఎలా స్పందిస్తారనేది ఆసక్తి నెలకొంది. 

ఈ క్రమంలో కర్నూలు కలెక్టరేట్ వద్ద ఎన్టీఆర్ అభిమానుల నిరసన వ్యక్తం చేశారు. తక్షణమే ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ను టీడీపీ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ధర్నాకు దిగారు. అయితే, ధర్నా చేయకుండా పోలీసులు వారిని అడ్డుకుని,  పోలీస్ స్టేషన్ కు తరలించారు.