ఖైరతాబాద్లో బస్తీ పర్యటన నిర్వహించిన ఎమ్మెల్యే దానం

ఖైరతాబాద్లో బస్తీ పర్యటన నిర్వహించిన ఎమ్మెల్యే దానం

ఖైరతాబాద్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఎమ్మెల్యే దానం నాగేందర్ బస్తీ బస్తీ పర్యటన నిర్వహించారు. ప్రజా సమస్యలపై పర్యటన చేసిన దానం నాగేందర్.. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఐమాక్స్, ఇందిరానగర్, బీజేఆర్ నగర్, ఓల్డ్ సీబీఐ క్వాటర్స్ సహా పలు బస్తీలలో పర్యటించారు. బస్తీలలో ప్రజా సమస్యలను ఎమ్మెల్యే దానం నేరుగా అడిగి తెలుసుకున్నారు.

జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్, ఎలక్ట్రికల్ ఉన్నత అధికారులతో కలిసి సమస్యలపై ఎమ్మెల్యే దానం ఆరా తీశారు. మంచినీటి, డ్రైనేజీతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ప్రజాసమస్యలే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.