
ఖైరతాబాద్, వెలుగు: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తన 5 కార్లపై ఉన్న పెండింగ్ చలాన్లను క్లియర్చేశారు. కార్లపై ఉన్న ఫైన్ల మొత్తాన్ని(రూ.36,365) చెల్లించారు. ఈ మేరకు ఆయన బంజారాహిల్స్ పోలీసుల ద్వారా ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. శనివారం ఫిలింనగర్ నుంచి బంజారాహిల్స్ వైపు వస్తున్న ఎమ్మెల్యే దానం నాగేందర్కారును ట్రాఫిక్ పోలీసులు ఆపారు. ఈ కారు ఎమ్మెల్యేది అని, లోన ఆయన కుటుంబ సభ్యులు ఉన్నారని డ్రైవర్పోలీసులతో చెప్పాడు. దీంతో పోలీసులు అక్కడి నుంచి పంపించేశారు. కారుపై రూ.5వేల చలాన్లు ఉన్నా పోలీసులు ఎమ్మెల్యే కారు అని వదిలేశారని ఓ వీడియో సోషల్మీడియాలో వైరల్అయ్యింది. నెటిజన్లు స్పందించారు. ‘సామాన్యుల కో న్యాయం.. అధికార పార్టీ లీడర్లో న్యాయమా’ అని కామెంట్స్చేశారు. ‘వెలుగు’లో కూడా వార్త ప్లబిష్అయ్యింది. స్పందించిన ఎమ్మెల్యే ఆదివారం తన 5 వెహికల్స్ పై ఉన్న చలాన్లు కట్టేశారు.