IPL 2026: విధ్వంసకర బ్యాటర్‌ను రిలీజ్ చేసిన కావ్యమారన్.. నెటిజన్స్ విమర్శలు

IPL 2026: విధ్వంసకర బ్యాటర్‌ను రిలీజ్ చేసిన కావ్యమారన్.. నెటిజన్స్ విమర్శలు

ఐపీఎల్ 2026 మినీ వేలంలో అమ్ముడుపోని అభినవ్ మనోహర్ ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో అద్భుతంగా ఆడుతున్నాడు. ఆడిన నాలుగు మ్యాచ్ ల్లో 176 పరుగులు చేసి తాను ఫామ్ లో ఉన్నానని ఐపీఎల్ ఫ్రాంచైజీలకు తెలిపాడు. ఇప్పటివరకు ఈ టోర్నీలో 90 బంతులు ఆడి 176 పరుగులు చేసిన అభినవ్.. ఓవరాల్ గా 9 సిక్సర్లు, 17 ఫోర్లు బాదాడు. తన అద్భుతమైన బ్యాటింగ్ తో విమర్శకులకు దిమ్మతిరిగే సమాధానం చెప్పాడు. ఈ టోర్నీలో నాలుగు ఇన్నింగ్స్ లు ఆడిన మనోహర్.. ఒక్క మ్యాచ్ లో కూడా ఔట్ కాలేదు.     

ఐపీఎల్ 2025లో అభినవ్ మనోహర్ సన్ రైజర్స్ జట్టులో ప్లేయర్. ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ లో మనోహర్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.3.20 కోట్లకు కొనుగోలు చేసింది. మిడిల్ ఆర్డర్ ను పటిష్టం చేసుకోవడానికి సన్ రైజర్స్ ఈ కర్ణాటక ప్లేయర్ ను కొనుగోలు చేసింది. స్క్వాడ్ లో ఉన్నప్పటికీ మనోహర్ కు ప్లేయింగ్ 11లో ఆడే అవకాశం లభించలేదు. ఒకటి రెండు మ్యాచ్ ల్లో అవకాశం వచ్చినా పర్వాలేదనిపించాడు. 2026 ఐపీఎల్ మినీ వేలానికి ముందు సన్ రైజర్స్ మనోహర్ ను రిలీజ్ చేసింది. ఇప్పుడు డొమెస్టిక్ క్రికెట్ లో అదరగొట్టడంతో ఈ కర్ణాటక బ్యాటర్ ను రిలీజ్ చేయకుండా ఉండాల్సింది అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. 

4 ఇన్నింగ్స్‌లలో 176 పరుగులు

విజయ్ హజారీ ట్రోఫీలో కర్ణాటక తరపున అభినవ్ మనోహర్ లోయర్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు ఇన్నింగ్స్‌లలో 90 బంతులు ఎదుర్కొని 176 పరుగులు చేశాడు. మనోహర్ విజయ్ హజారే ట్రోఫీలో తొలి మ్యాచ్ లో అజేయంగా  జార్ఖండ్‌పై 56 పరుగులు చేశాడు. డిసెంబర్ 26న కేరళతో జరిగిన రెండో మ్యాచ్‌లో అతనికి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. డిసెంబర్ 29న తమిళనాడుపై జరిగిన మ్యాచ్‌లో 20 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. రెండు రోజుల తర్వాత పుదుచ్చేరిపై 21 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. జనవరి 3న త్రిపురపై జరిగిన మ్యాచ్‌లో అజేయంగా 79 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.