అఖిల్ అక్కినేని నుంచి రాబోతున్న లేటెస్ట్, మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘లెనిన్’ (LENIN). వరుస ఫెయిల్యూర్స్ లతో ఉన్న అఖిల్ ఈ సారి గట్టిగా సక్సెస్ కొట్టేందుకు రెడీ అవుతున్నారు. విభిన్న కథాంశాలతో ఈసారి పక్కా మాస్, యాక్షన్ రూరల్ డ్రామాతో పలకరించడానికి సిద్ధమయ్యాడు. ఈ చిత్రానికి మురళీ కే కిషోర్ అబ్బూరి దర్శకత్వం వహిస్తున్నారు. అఖిల్ కి జోడీగా మోస్ట్ ట్రెండింగ్ బ్యూటీ భాగ్యశ్రీ నటిస్తోంది. ఇప్పటికే, లెనిన్ ఫస్ట్ గ్లింప్స్ విడుదలై ఆసక్తి క్రియేట్ చేసింది. ఈ క్రమంలోనే మరో క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
‘వారెవారెవా వారెవారెవా.. ఎన్నెలల్లే ఉంటాది మా భారతి..’ అంటూ లెనిన్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో భారతి పాత్రలో భాగ్యశ్రీ లంగా ఓణీ కట్టుకుని ట్రెడిషినల్ గెటప్‌లో ఇంప్రెస్ చేస్తోంది. జాతర బ్యాక్‌డ్రాప్‌లో ఉన్న ఈ సాంగ్ ఆకట్టుకునేలా ఉంది. తమన్ కంపోజ్ చేసిన ఈ పాటకు అనంత శ్రీరామ్ వినసొంపైన లిరిక్స్ అందించారు. శ్వేత మోహన్, జూబిన్ ఆకట్టుకునేలా పాడారు. ఓవరాల్గా..అఖిల్- భాగ్యశ్రీల ట్రెడిషినల్ గెటప్‌లో వచ్చిన ఈ సాంగ్ ఇంప్రెస్ చేసేలా కనిపిస్తోంది.
ఈ సినిమాకు అక్కినేని కుటుంబానికి చెందిన ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్తో పాటు, ప్రముఖ బ్యానర్ సితార ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మాణం వహిస్తుండడం విశేషం. ఇది ప్రధానంగా రాయలసీమ బ్యాక్ డ్రాప్‌లో, ముఖ్యంగా చిత్తూరు ప్రాంతపు కథాంశంతో తెరకెక్కుతోందని తెలుస్తోంది. ఎమోషనల్ లవ్ స్టోరీ, హై ఓల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు హైలైట్‌గా ఉండేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సమ్మర్‌లో సినిమా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు.
