- మహారాష్ట్ర, కర్ణాటక కూడా వ్యతిరేకిస్తున్నయ్
- కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే రాయలసీమ లిఫ్ట్ ఆగింది
- నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చిట్ చాట్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన పోలవరం - సల్లమల సాగర్ ప్రాజెక్టు లను తాము అన్ని ఫోరంలలో వ్యతిరేకిస్తున్నట్టు నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. మాజీ మంత్రి హరీశ్ రావు చూపిస్తున్న లేఖ ఈ ప్రాజెక్టులకు సంబంధించినది కాదని క్లారిటీ ఇచ్చారు. పోలవరం నల్లమల్ల ఇంటర్ స్టేట్ రూల్ నకు వ్యతిరేకమని జీఆర్ఎంబీకి తామే లేఖ రాశామని ప్రస్తావించారు. తమ అభిప్రాయాన్ని జీఆర్ఎంబీ కూడా సమర్థించిందని గుర్తుచేశారు. ఇవాళ ( జనవరి 5) ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు.
పోలవరం నల్ల మల్ల ప్రాజెక్టును మహారాష్ట్ర, కర్ణాటక కూడా వ్యతిరేకిస్తున్నాయని తెలిపారు. సుప్రీంకోర్టులో తెలంగాణ వాదనలను బలంగా వినిపించాలని న్యాయవాది అభిషేక్ సింఘ్వీకి సూచించామని పేర్కొన్నారు. ఈ కేసును వచ్చే సోమవారానికి సుప్రీంకోర్టు వాయిదా వేసిందని తెలిపారు. ఆ రోజు విచారణకు తాను కూడా ప్రత్యక్ష్యంగా హాజరవుతానని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిపివేశారని స్పష్టం చేశారు. గతంలో ఈ పథకం ఆగిపోయి ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు చెప్పలేదన్నారు. కేసీఆర్ హయాంలో పాలమూరు రంగారెడ్డిని జూరాల నుంచి శ్రీశైలానికి మార్చి, తుమ్మిడిహెట్టినుంచి మేడిగడ్డకు కాళేశ్వరాన్ని మార్చి భారీ నష్టం చేశారని ఆరోపించారు.
