- ఏటా సముద్రంలోకి మూడు వేల టీఎంసీలు
- కృష్ణా, గోదావరి నీళ్ల కోసం కలిసి ముందుకెళ్లాం
- విభజన తర్వాత కాళేశ్వరం కడితే అడ్డు చెప్పలే
- ఏపీలోని నదులన్నింటినీ అనుసంధానిస్తం
- గంగా, కావేరి కలవాలి..సమస్య పరిష్కారం కావాలి
- కల్వకుర్తి లిఫ్ట్, ఏఎమ్మార్ ఎత్తిపోతల, నెట్టెంపాడు నేనే పూర్తి చేశా
- గుంటూరులో ఏపీ సీఎం చంద్రబాబు
అమరావతి: తెలంగాణ ప్రాజెక్టులకు తాను ఏనాడు అడ్డు చెప్పలేదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఇవాళ ( జనవరి 5) గుంటూరు జిల్లాలో జరిగిన తెలుగు మహాసభలో ఆయన మాట్లాడా రు. గతేడాది సుమారు కృష్ణా, గోదావరి నదుల నుంచి 6,282 టీఎంసీల నీరు సముద్రంలోకి వెళ్లాయని ఆవేదన వ్యక్తం చేశారు.
గోదావరి నీళ్లు పుష్కలంగా ఉన్నాయని అన్నారు. గోదావరి నీళ్లను తెలంగాణ వాడుకున్నా తాను ఏనాడు అడ్డు చెప్పలేదని స్పష్టం చేశారు. విభజన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినా అభ్యంతరం చెప్పలేదని అన్నారు. ప్రతి ఏడాది గోదావరి నుంచి సముద్రంలోకి మూడువేల టీఎంసీల నీళ్లు వృథాగా పోతున్నాయని చెప్పుకొచ్చారు. కృష్ణాగోదావరి నదులు అనుసంధానం జరుగు తుందని వెల్లడించారు. ఏపీలోని నదులన్నింటినీ అనుసంధానించాలని సూచించారు.
కల్వకుర్తి లిఫ్ట్, ఏఎమ్మార్ ఎత్తిపోతల, నెట్టెంపాడు వంటి ప్రాజెక్టులను తాను పూర్తి చేశానని స్పష్టం చేశారు. కృష్ణా డెల్టా మోడరైజేషన్ పేరుతో నీటిని పొదుపు చేసి ఆ నీటిని తెలంగాణకు కేటాయించి బీమా లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేశామని వెల్లడించా రు. గోదావరి నదిపై గుత్ప, అలీసాగర్, దేవాదుల ఎత్తిపోతల వంటి పథకాలను చేపట్టామని వివరించారు. ఆంధ్ర ప్రాంతంలో చాగల్నాడు, పుష్కర, తాటిపూడి వంటి లిఫ్ట్ ప్రాజెక్టులు తీసు కువచ్చామని తెలిపారు. పట్టిసీమ ప్రాజెక్టుతో కృష్ణా డెల్టాకు నీరిచ్చామని అన్నారు. విభజన తర్వాత కేంద్ర ప్రభుత్వం పోలవరానికి ప్రత్యేక నిధులిచ్చిందని అన్నారు.
తెలుగు ప్రజలకు రెండు రాష్ట్రాలున్నా... తెలుగే మాతృభాష అని తెలిపారు. రెండు రాష్ట్రాలు కలిసి ఉంటే ఎన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నా రు. ఎన్టీఆర్ సీఎం అయ్యాకే... సాగర్ జలాలను ఉపయోగించుకునేలా ఎస్ఎల్బీసీ, ఎస్ఎర్బీసీ ప్రాజెక్టులు తెచ్చారని ప్రస్తావించారు.
