
- బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మాటలతోనే .. అసెంబ్లీలో సహనం కోల్పోయా
- ఎమ్మెల్యే దానం నాగేందర్ వివరణ
బషీర్ బాగ్, వెలుగు: బీఆర్ఎస్ఎమ్మెల్యేలు అసెంబ్లీలో తనను కావాలనే టార్గెట్ చేశారని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. వారి కామెంట్ల కారణంగా తాను సహనం కోల్పోయానని చెప్పారు. శనివారం ఆదర్శ్‌నగర్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో హిమాయత్ నగర్ కార్పొరేటర్ మహాలక్ష్మి రామన్ గౌడ్ తో కలిసి లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దానం మాట్లాడుతూ.. అసెంబ్లీలో హైదరాబాద్ అభివృద్ధిపై తాను మాట్లాతున్నప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆటంకం కలిగించారని చెప్పారు.
బయటకు చెప్పలేని పదాలతో దూషించారన్నారు. వారు మాట్లాడింది రికార్డ్ కాలేదని.. వారికి సమాధానంగా ఆ వ్యాఖ్యలు చేశానన్నారు. తెలంగాణ యాసలో సహజంగానే మాట్లాడానని.. ఎవరికైనా ఇబ్బంది కలిగితే క్షమించాలని కోరారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పద్ధతిని మార్చుకోవాలని దానం సూచించారు.