ఏవీ రంగనాథ్‌పై MLA దానం సెన్సేషనల్ కామెంట్స్

ఏవీ రంగనాథ్‌పై MLA దానం సెన్సేషనల్ కామెంట్స్

హైడ్రా కమిషనర్‌ AV రంగనాథ్‌ పై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 69 నందగిరిహిల్స్లో.. జీహెచ్ఎంసీకి చెందిన ప్రభుత్వ స్థలం ప్రహరీ గోడను తొలగించిన కేసులో.. A3గా దానం నాగేందర్ పై  కేసు నమోదైంది. హిమాయత్ నగర్ డివిజన్ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు వచ్చిన దానం.. తనపై నమోదైన కేసుపై స్పందించారు. 

ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ.. అధికారులు వస్తుంటారు.. పోతుంటారు.. నేను లోకల్ అంటూ వ్యాఖ్యలు చేశారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కు.. కొత్తగా వచ్చిన పదవి ఇష్టం లేనట్లుంది.. అందుకే నాపై కేసు పెట్టారంటూ కామెంట్స్ చేశారు ఎమ్మెల్యే దానం. నందగిరిహిల్స్ హుడా లే ఔట్ లో ప్రజలకు ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశంతోనే.. అక్కడకి వెళ్లినట్లు చెప్పుకొచ్చారాయన.

జరిగిన విషయాన్ని ఐపీఎస్ రంగనాథ్‌ దృష్టికి తీసుకెళ్ళానని స్పష్టం చేశారు దానం. హైదరాబాద్ కాస్మోపాలిటన్ సిటీ కాబట్టి.. అన్నివర్గాల ప్రజలకు సౌకర్యాలు కల్పించడం, సమస్యలు తీర్చడం ప్రజాప్రతినిధిగా నా బాధ్యతగా చెప్పుకొచ్చారు ఎమ్మెల్యే.  నందగిరిహిల్స్ హుడా లే ఔట్ ఘటనపై అధికారులకు ప్రివిలేజీషన్ నోటీసులు ఇస్తానని.. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లనున్నట్లు వెల్లడించారాయన.  అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానంటూ వార్నింగ్ ఇచ్చారు.