వీఆర్ఏల సమస్యలు ఎందుకు తీర్చట్లే?

వీఆర్ఏల సమస్యలు ఎందుకు తీర్చట్లే?
  • వృద్ధిరేటు బాగుంటే  జీతాలు లేటెందుకు?
  • వీఆర్ఏల సమస్యలు ఎందుకు తీర్చట్లే?: ఈటల

హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో వృద్ధిరేటు అద్భుతమని  వరంగల్ సభలో సీఎం కేసీఆర్ అన్నారని, వృద్ధిరేటు నిజంగా అంత బాగుంటే ఉద్యోగులకు జీతాలు ఎందుకు లేట్​గా ఇస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రశ్నించారు.  వీఆర్ఏల సమస్యలు ఎందుకు పరిష్కరించడం లేదని నిలదీశారు. శనివారం హైదరాబాద్ లో మీడియాతో ఆయన మాట్లాడారు. రెగ్యులర్ ఉద్యోగుల జీతాలు సైతం 15వ తేదీ తరువాత ఇస్తున్నారని, దసరా ఉన్నా జీతాలు ఆలస్యంగా ఇవ్వడం చాలా బాధాకరమని ఈటల అన్నారు.  కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు నెలల తరబడి జీతాలు ఆలస్యం చేస్తున్నారని ఫైరయ్యారు. సీఎం చెప్పే మాటలు నిజమైతే ఇన్ని సమస్యలు ఎందుకు ఉన్నాయన్నారు. వీఆర్ఏ లు వినతిపత్రం ఇస్తే విసిరేయడం దారుణమన్నారు.