కామారెడ్డి నుంచే కేసీఆర్ పోటీ.. ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కామెంట్ 

కామారెడ్డి నుంచే కేసీఆర్ పోటీ.. ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కామెంట్ 

హైదరాబాద్, వెలుగు: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్​ వందశాతం కామారెడ్డి నుంచే పోటీ చేస్తారని ప్రభుత్వ విప్, ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే గంప గోవర్ధన్​ తెలిపారు. శనివారం అసెంబ్లీ లాబీలో ఆయన మీడియాతో చిట్​చాట్​చేశారు. 

కామారెడ్డి నుంచి పోటీ చేయాలని కేసీఆర్​ను నేనే మూడుసార్లు కోరాను. సామాన్య కార్యకర్తగా పని చేసి కేసీఆర్​ను గెలిపిస్తాను. కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేస్తే, నేనేం చేయాలనేది పార్టీ చీఫ్​గా ఆయనే​ నిర్ణయిస్తారు. కేసీఆర్ ​సొంతూరు కామారెడ్డి జిల్లాలోని పోసానిపల్లి.. అదే ప్రస్తుత కోనాపూర్. మానేరు ప్రాజెక్టులో వాళ్ల ఊరు మునిగిపోయింది. అందుకే కేసీఆర్ కుటుంబం చింతమడకకు వెళ్లింది” అని గోవర్ధన్ చెప్పారు. కాగా, కేసీఆర్​ ఈసారి గజ్వేల్​లో కాకుండా కామారెడ్డి నుంచి పోటీ చేస్తారని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో గంప గోవర్ధన్​వ్యాఖ్యలకు ప్రాధాన్యం సంతరించుకున్నది.