అమీన్పూర్(పటాన్చెరు), వెలుగు: క్రీడాకారులకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. కర్నాటక రాజధాని బెంగళూరులో జరిగే జాతీయ స్థాయి ఖోఖో జూనియర్స్ పోటీల్లో పాల్గొంటున్న తెలంగాణ జట్టుకు లక్ష రూపాయలతో ట్రాక్ సూట్లను కొనుగోలు చేసి క్రీడాకారులకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల నుంచి మెరుగైన ప్రదర్శనలతో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికవడం సంతోషకరమన్నారు.
జాతీయ, రాష్ట్ర స్థాయి క్రీడలకు పటాన్చెరును కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ ఖోఖో అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి, ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు హరికిషన్, మైత్రి క్రికెట్ క్లబ్అధ్యక్షుడు హనుమంత్‌రెడ్డి, ఎస్ఐ విద్యాచరణ్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌గౌడ్, క్రీడాకారులు పాల్గొన్నారు.
