
కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఇవాళ జలదీక్షకు వెళుతున్న ఆయనను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. గత కొన్ని రోజులుగా ఆయన సంగారెడ్డికి గోదావరి జలాలను తరలించాలని డిమాండ్ చేస్తున్నారు. గోదావరి జలాలను తమ జిల్లాలకు తరలించే వరకూ నిరాహార దీక్షకు చేస్తానని అన్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఆయన జలదీక్షకు వెళుతుండగా పోలీసులు అరెస్ట్ చేసి కొండాపూర్ పీఎస్‌కు తరలించారు.