
పాట్నా: బిహార్లోని భాగల్పూర్ జిల్లా గోపాల్‌పూర్ నియోజకవర్గ సిట్టింగ్ఎమ్మెల్యే(జేడీయూ) గోపాల్ మండల్ మంగళవారం సీఎం నితీశ్కుమార్ఇంటి ముందు ఆందోళనకు దిగారు. తనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే వరకు ఇక్కడి నుంచి కదలనని పట్టుబట్టారు. బిహార్లోని 243 అసెంబ్లీ స్థానాల్లో సీట్ల పంపకాలలో భాగంగా ఎన్డీయేలోని బీజేపీ, జేడీయూ చెరో 101 సీట్లు, ఎల్‌జేపీ(ఆర్వీ పీ)కి 29, ఆర్‌ఎల్‌ఎం, హెచ్‌ఏఎంకు 6 సీట్ల చొప్పున కేటాయించారు.
అయితే, సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అన్ని స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. కానీ, మండల్ సహా నలుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వలేదు. మండల్ ప్రాతినిధ్యం వహిస్తున్న గోపాల్‌పూర్ స్థానాన్ని సీట్ల షేరింగ్లో భాగంగా బీజేపీకి కేటాయించారు. దీంతో మనస్తాపం చెందిన మండల్.. మంగళవారం ఉదయం తన అనుచరులతో కలిసి నితీశ్ ఇంటికి వెళ్లారు.
అపాయింట్‌మెంట్ లేకపోవడంతో సెక్యూరిటీ సిబ్బంది అతడిని లోపలికి అనుమతించలేదు. దీంతో అతడు గేటు ముందు కూర్చొని ఆందోళన చేపట్టాడు. ఈ సందర్భంగా మండల్ మాట్లాడుతూ.. ‘‘మా పార్టీ అధినేత అయిన సీఎం.. నాకు టికెట్ఇచ్చే వరకు నేను వెనక్కి తగ్గను. కావాలంటే భద్రతా సిబ్బంది లాఠీ చార్జ్ చేసుకోవచ్చు’’ అని ఆయన అన్నారు.