దేశమంతా ‘రావాలి కేసీఆర్..’ అంటున్నరు

దేశమంతా ‘రావాలి కేసీఆర్..’ అంటున్నరు

హైదరాబాద్, వెలుగు: అఖండ భారత్.. సీఎం కేసీఆర్ వైపు చూస్తోందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ఎంట్రీ కోసం కంట్రీ అంతా వెయిట్ చేస్తోందని సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద అన్నారు. బీజేపీ ముక్త్ భారత్ కోసం 28 రాష్ట్రాలు, యూటీల ప్రజలు ‘‘రావాలి కేసీఆర్.. కావాలి కేసీఆర్.. సారు కావాలె.. కారు రావాలె” అని అంటున్నారని చెప్పారు. రైతు బంధు, కల్యాణలక్షి, ఉచిత కరెంట్ లాంటి పథకాల కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో 2 వేల హెడ్ మాస్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, బడుల సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి డిమాండ్ చేశారు.