బెజ్జంకి మండలంలోని క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి

బెజ్జంకి మండలంలోని  క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి

బెజ్జంకి, వెలుగు : నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని మండలంలోని బెజ్జంకి క్రాసింగ్ జీపీ లో గురువారం ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, సర్పంచ్​గాజ రవళి శ్రీనివాస్​తో కలిసి కేక్ కట్ చేసి  నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం క్యాలెండర్ ను ఆవిష్కరించి ఎమ్మెల్యే మాట్లాడారు. మండల ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుతున్నానని తెలిపారు. 

కార్యక్రమంలో ఎంపీడీవో కడివేరు ప్రవీణ్, ఏఎంసీ చైర్మన్ పులి కృష్ణ, పార్టీ అధ్యక్షుడు ముక్కిస రత్నాకర్ రెడ్డి, బెజ్జంకి ఇల్లంతకుంట గన్నేరువరం బ్లాక్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్, ముష్కు ఉపేందర్ రెడ్డి, కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి, వైస్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, ఆలయ చైర్మన్ జిల్లా ప్రభాకర్, బైర సంతోష్, బోయిన సంతోష్, రావుల నరసయ్య, సాదిక్ తదితరులు పాల్గొన్నారు.