నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా

నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా

ఒక్క ఎకరం కొత్తగా పోడు వ్యవసాయం చేస్తున్నట్టు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు  సిర్పూరు ఎమ్మెల్యే కోనప్ప. ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ సమావేశంలో అటవీ శాఖ అధికారులపై ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఫైర్ అయ్యారు. జిల్లాలో పొడుభూముల సమస్య తీవ్రంగా ఉందని హరితహారం కోసం ఊర్లోకి వెళ్ళినపుడు పొడుభూములపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేకపోతున్నామన్నారు. రైతులు విత్తనాలు పెట్టె సమయంలో ఆపడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. ఫారెస్ట్ అధికారులు రైతులపై దౌర్జన్యం చేస్తున్నారని.. పొలాల్లోకి వెళ్తే కేసులు పెడతామని బెదిరిస్తున్నారని చెప్పారు. ఇలాంటి చర్యలు వల్ల మేము గ్రామాల్లో తిరిగే పరిస్థితి లేదని.. పులుల పేర్లతో రైతులను ఇబ్బందులు పెడుతున్నారన్నారు. ప్రజలు సహకరించకపోతే పులులు ఉండేవా అన్నారు. జిల్లాలో 11 పులులు ఉండడం గర్వ పడుతున్నామని.. ఎక్కడ మొక్కలు నాటాలో ముందే  నిర్ణయించాలన్నారు. రైతులను కొట్టే అధికారం మీకు ఎక్కడిదని.. మేము ఏం తప్పో చేశామో చెప్పాలన్నారు. మీ కేసులు దౌర్జన్యం భరించలేకుండా ఉన్నాయని.. మీకు రెండు చేతిలెక్కి మొక్కుతాం మా రైతులను , ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని సమావేశంలో అటవీశాఖ అధికారులను ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కోరారు.