బెయిల్‌ పై విడుదలైన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి

బెయిల్‌ పై విడుదలైన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి

నెల్లూరు: నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి బెయిల్‌ మంజూరైంది. ఎంపీడీవో సరళ ఇంటిపై దాడి కేసులో తెల్లవారు జామున పోలీసులు కోటంరెడ్డిని అరెస్ట్‌ చేశారు. ఈ ఉదయం మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరచగా, మొబైల్‌ అండ్‌ స్పెషల్‌ జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ కోటంరెడ్డికి బెయిల్‌ మంజూరు చేసింది.

అనంతరం కోటంరెడ్డి మీడియాతో మాట్లాడుతూ..  తనపై  MPDO చేత కేసు పెట్టించింది YCP మండల అధ్యక్షుడని చెప్పారు. ఆ అధ్యక్షుడి వెనుకున్న YCP పెద్ద తలకాయ ఎవరో సీఎం జగన్ విచారణ చేయాలని కోరారు.

MPDO కు గతంలో ఫోన్ చేయడం వాస్తవమని, ఆ సమయంలో కాకని గోవర్ధన్ రెడ్డి గారు పర్మీషన్ ఇవ్వద్దని చెప్పారని MPDO చెప్పినట్టు ఎమ్మెల్యే కోటంరెడ్డి మీడియాకి తెలిపారు. తనతో కాకని గోవర్దన్ రెడ్డి… ఆ భూమి పై సమస్య ఉందని, పర్మీషన్ కుదరని చెప్పారన్నారు. తాను మళ్లీ MPDO ఇంటికి పోయి పర్మీషన్ అడగడం వల్ల తనపై కుట్ర పన్ని ఈ కేసు పెట్టారని ఎమ్మెల్యే ఆరోపించారు. తనను పార్టీకి దూరం చేయడమే లక్ష్యంగా మానసికంగా కోందరు ఇబ్బంది పెడుతున్నారని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.

MLA KotamReddy Sridhar Reddy released on bail