లష్కర్​లో గులాబీ జెండా ఎగరడం ఖాయం: కేటీఆర్

లష్కర్​లో గులాబీ జెండా ఎగరడం ఖాయం: కేటీఆర్

అంబర్​పేట, వెలుగు: గ్రేటర్​ హైదరాబాద్​ బీఆర్ఎస్​కు కంచుకోటగా మారిందని, లోక్​సభ ఎన్నికల్లోనూ సికింద్రాబాద్​లో గులాబీ జెండా ఎగురుతుందని ఎమ్మెల్యే కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన సికింద్రాబాద్ బీఆర్ఎస్​ ఎంపీ అభ్యర్థి టి.పద్మారావుగౌడ్ కు మద్దతుగా అంబర్​పేట నియోజకవర్గంలో పాదయాత్ర చేశారు.

పటేల్ నగర్, ప్రేమ్ నగర్ చౌరస్తా నుంచి ఆజాద్ నగర్, పటేల్ వాడలో ఇంటింటికి తిరిగారు. స్థానికులను కలిసి ఓటు అభ్యర్థించారు. పద్మారావు గౌడ్ ను ఎంపీగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పాదయాత్రలో ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, కార్పొరేటర్లు, యువజన నాయకులు రామేశ్వర్ గౌడ్ , ముఠా జైసింహ, డివిజన్ ప్రెసిడెంట్ భవాని ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.