
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్రెడ్డి కోరారు. గురువారం ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల సమావేశానికి హాజరై మాట్లాడారు. మీడియా ప్రతినిధులు ఎలాంటి ఒత్తిళ్లకు లోనుకాకుండా నిజాయతీగా పని చేయాలని కోరారు.
రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో మీడియా పాత్ర కీలకమన్నారు. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. టీడబ్ల్యూజేయూ రాష్ట్ర కార్యదర్శి మధు గౌడ్, జిల్లా అధ్యక్షుడు వెంకటస్వామి, విజయ్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు.