V6 News

ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల చెల్లింపుల్లో పేదలను ఇబ్బంది పెట్టొద్దు : ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల చెల్లింపుల్లో పేదలను ఇబ్బంది పెట్టొద్దు : ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల చెల్లింపుల్లో పేదలను ఇబ్బంది పెట్టవద్దని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అధికారులకు సూచించారు. గురువారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పలు శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు నిర్దేశించిన గడువులోగా పూర్తయ్యేలా అధికారులు ప్రణాళిక రూపొందించాలని సూచించారు.  

సాంకేతిక కారణాలతో బిల్లుల చెల్లింపుల్లో ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని  చెప్పారు. బిల్లుల కోసం పేదలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి రాకూడదన్నారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందేలా అధికారులు చొరవ చూపాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం  మేయర్ మూడ్ గణేష్, హౌసింగ్ పీడీ రవీంద్రనాథ్,  కమిషనర్ సుజాత పాల్గొన్నారు.