
రామచంద్రాపురం, వెలుగు: తెల్లాపూర్మున్సిపాలిటీ పరిధిలోని ఉస్మాన్‌నగర్ బీమ్యాక్ సొసైటీకి ఇంప్రూవ్మెంట్ చార్జీలను రద్దు చేయాలని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కోరారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లోని వాటర్ వర్క్స్కార్యాలయంలో ఎండీ అశోక్‌రెడ్డిని కలిసి వినతిప్రతం అందజేశారు. రిటైర్డ్ఎంప్లాయ్స్నివసిస్తున్న బీమ్యాక్ కాలనీకి మంచి నీటి కనెక్షన్లు ఇవ్వడానికి అధికారులు రూ.86 లక్షల ఇంప్రూవ్మెంట్ చార్జీలు వేశారని తెలిపారు.
అక్కడ నివసిస్తున్న కుటుంబాల ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకొని చార్జీలను రద్దు చేస్తే మిగతా బిల్లులు చెల్లిస్తారని చెప్పారు. అలాగే, పటాన్చెరు పరిధిలోని పారిశ్రామిక వాడకు తాగునీటి కనెక్షన్ఇవ్వాలని కోరారు. అనంతరం నియోజకవర్గంలో జలమండలి చేపడుతున్న తాగునీటి సరఫరా, రిజర్వాయర్లు, కొత్త కనెక్షన్లపై అధికారులతో చర్చించారు. ఐలా చైర్మన్ సుధీర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, శ్రీనివాస్, నర్సింహ, ఉమేశ్, మధు, శివ నారాయణ తదితరులు పాల్గొన్నారు.