అమీన్పూర్(పటాన్చెరు), వెలుగు: కేంద్రం తీసుకొచ్చిన నాలుగు కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా త్వరలో పటాన్చెరులో భారీ నిరసన సభ చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తెలిపారు. శనివారం సాయంత్రం క్యాంప్ ఆఫీసు ఆవరణలో నూతన కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన కార్మికుల సమావేశానికి హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం 29 పాత కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు కొత్త కార్మిక చట్టాలను తీసుకొచ్చి కార్మిక రంగానికి వెన్నుపోటు పొడిచిందన్నారు.
వచ్చే ఏడాది నుంచి కార్మికులపై బలవంతంగా రుద్దుతున్న లేబర్ కోడ్లు అమలవుతాయన్నారు. పాత కార్మిక చట్టాలలో కనీస వేతనం నిర్ణయించే అంశం కేంద్రం, రాష్ర్టాల ఉమ్మడి అంశంగా ఉందని, నూతన లేబర్ కోడ్లలో రాష్ర్టాల హక్కులు తొలగించడం బాధాకరమన్నారు. పటాన్చెరులో నిర్వహించబోయే భారీ నిరసన సభ విజయవంతానికి ప్రతి కార్మికుడు పని చేయాలన్నారు.
జిన్నారం: జిన్నారం మున్సిపల్ కేంద్రంలో నిర్మిస్తున్న జీవనజ్యోతి జ్యోతిర్లింగం శివాలయం అభివృద్ధికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి భారీ విరాళం అందించి దైవభక్తి చాటుకున్నారు. శనివారం స్థానిక నాయకులు, ఆలయ కమిటీ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే దేవాలయాన్ని దర్శించారు. దేవాలయం అభివృద్ధి కోసం రూ.16 లక్షల భారీ విరాళాన్ని ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు.
జీవనజ్యోతి జ్యోతిర్లింగం క్షేత్ర అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. ఆలయ సమీపంలో గల డంపు యార్డును వేరే స్థలానికి మార్చాలని మండల రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం జిన్నారంలో ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహం కోసం రూ. లక్షా 50 వేలు గ్రామస్తులకు అందజేశారు.
పటాన్చెరు సర్కిల్ డిప్యూటీ కమిషనర్గా సురేశ్
పటాన్చెరు జీహెచ్ఎంసీ సర్కిల్ డిప్యూటీ కమిషనర్గా సురేశ్ శనివారం బాధ్యతలు చేపట్టారు.
