‘ప్రగతి ప్రణాళిక’ను బాయ్కాట్ చేసిన మల్లారెడ్డి... ప్రోగ్రామ్ లేట్ కావడంపై అసంతృప్తి

‘ప్రగతి ప్రణాళిక’ను బాయ్కాట్ చేసిన మల్లారెడ్డి... ప్రోగ్రామ్ లేట్ కావడంపై అసంతృప్తి

కీసర, వెలుగు: ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక మేడ్చల్ నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని మేడ్చల్ ఎమ్మెల్యే చమకూర మల్లారెడ్డి శనివారం బహిష్కరించి వెళ్లిపోయారు. కార్యక్రమం సమయానికి ప్రారంభం కాకపోవడంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. 

ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. ఉదయం 9.30 గంటలకు ప్రోగ్రామ్​ స్టార్ట్​ అవుతుందంటే, అదే సమయానికి తాను వచ్చానన్నారు. కానీ 11 గంటలైనా మీటింగ్​ మొదలుకాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఎమ్మెల్యేలకు గౌరవం ఇవ్వకుండా అధికారులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయమై కీసర ఆర్డీవో రాజేశ్​కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మల్లారెడ్డి నిలదీశారు.