హైదరాబాద్, వెలుగు: ఇవాళ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఐటీ అధికారుల ఎదుట హాజరుకానున్నట్టు సమాచారం. భువనగిరి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ఐటీ విచారణకు హాజరయ్యారు. గురువారం ఉదయం 11 కు ఫతేమైదాన్‌లోని ఐటీ ఆఫీసుకు వచ్చారు. అసిస్టెంట్ కమిషనర్ ఆధ్వర్యంలోని స్పెషల్ టీమ్‌ను కలిసి తన వివరాలు అందించారు. ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నందున అధికారులు అనుమతి ఇవ్వడంతో గంట సేపటి తర్వాత తిరిగి వెళ్లిపోయారు. ఐటీ చెల్లింపుల్లో అవతవకలు జరిగాయనే ఆరోపణలతో ఈ నెల 17 నుంచి 3 రోజులు శేఖర్‌రెడ్డితో పాటు నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రిజనార్దన్‌రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి చెందిన ఇండ్లు, ఆఫీసుల్లో ఐటీ సోదాలు చేసిన సంగతి తెలిసిందే. సోదాల్లో అనుమానాస్పద డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. తమ ముందు హాజరై వివరణ ఇవ్వాలని నోటీసులు ఇచ్చారు.
