V6 News

నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా : ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా :  ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
  •    ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం 

బోయినిపల్లి,వెలుగు: రాష్ట్రంలోనే చొప్పదండి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం కోరెంలో శ్రీ కొండ పోచమ్మ తల్లి ఆలయానికి  రూ.50 లక్షలతో వేసిన సీసీ రోడ్డును ప్రారంభించారు. పోచమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను పోచమ్మ తల్లి ఆశీర్వాదంతో గెలిచానన్నారు. ఇచ్చిన హామీ మేరకు తాను ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నానన్నారు. అనంతరం అంగన్వాడీ కార్యకర్తలకు మొబైల్ ఫోన్లు అందజేశారు. అంతకుముందు కొదురుపాకలో బల్క్ మిల్క్, అంగన్వాడీ భవనాలకు, బస్టాండ్, పైప్ లైన్, వారసంత పనులకు భూమి పూజ చేశారు.