జనగామ బరిలో నేనే ఉంటా..పల్లా ఓడిపోతడని సర్వేల్లో తేలింది: ముత్తిరెడ్డి

జనగామ బరిలో నేనే ఉంటా..పల్లా ఓడిపోతడని సర్వేల్లో తేలింది: ముత్తిరెడ్డి
  •     ఆర్టీసీ చైర్మన్​గా బాధ్యతల   స్వీకరణ

హైదరాబాద్/జనగామ, వెలుగు : జనగామ బరిలో తానే ఉంటానని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మరోసారి హాట్​కామెంట్స్​ చేశారు. ఆర్టీసీ చైర్మన్​గా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. హనుమకొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్​ రెడ్డిని జనగామలో నిలిపితే ఓడిపోతాడని సర్వే రిపోర్టు వచ్చిందన్నారు. గెలుపు అవకాశాలు తనకే ఉన్నట్లు సర్వేలో తేలడంతో కేసీఆర్​ పునరాలోచన చేస్తున్నారని, త్వరలోనే  అధికారిక ప్రకటన వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 

ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా నియోజకవర్గంలోని ఓటర్లు తనకే మద్దతుగా ఉన్నారని, మూడో సారి తన గెలుపు ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతకుముందు హైదరాబాద్​లోని బస్ భవన్ లో ఆర్టీసీ చైర్మన్ గా ముత్తిరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఉద్యమంలో కేసీఆర్ తో కలిసి పనిచేశానని, రెండు సార్లు జనగామ ఎమ్మెల్యేగా అవకాశమిచ్చారని, ఇపుడు ఆర్టీసీ చైర్మన్ బాధ్యతలు అప్పగించారని తెలిపారు. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగులు, కార్మికులు, అధికారులతో కలిసి ఆర్టీసీని లాభాల్లోకి తీసుకొస్తానని పేర్కొన్నారు. కార్మికుల సమస్యలపై చర్చించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ముత్తిరెడ్డి తెలిపారు. అనంతరం టీఎంయూ నేతలు ముత్తిరెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పెండింగ్ లో ఉన్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని యూనియన్​ జనరల్ సెక్రటరీ థామస్ రెడ్డి చైర్మన్ ముత్తిరెడ్డి ని కోరారు.