ప్రత్యర్థులు నాపై కుట్రలు చేస్తున్నరు.. కన్నీరు పెట్టుకున్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి

ప్రత్యర్థులు నాపై కుట్రలు చేస్తున్నరు.. కన్నీరు పెట్టుకున్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి

తన కూతురు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి స్పందించారు. మే 9వ తేదీ మంగళవారం ఆయన మీడియా సమావేశంలో భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్నారు. ప్రజల ఆశీర్వాదంతో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని అన్నారు. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడడంతో ప్రత్యర్థులు ఇలాంటి కుట్రలు చేస్తున్నారని తెలిపారు. తనపై ఎలాంటి మచ్చ లేకపోవడంతో.. తన కూతురుకు సంబంధించిన విషయాన్ని అడ్డం పెట్టుకొని చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారని ఆరోపించారు. గతంలో బతుకమ్మ కుంట విషయంలో అప్పటి కలెక్టర్ దేవసేనతో ప్రెస్ మీట్ పెట్టించి తనను బదునాం చేయించారని తెలిపారు.

సిద్దిపేట జిల్లా చేర్యాలలో 1402 సర్వే నెంబర్ పరిధిలో తన కూతరు పేరిట 1200 గజాల స్థలం ఉందని.. దీనిపై రాజకీయ ప్రత్యర్థులు కోర్టు, లోక్ అదాలత్ లో కూడా ఫిర్యాదు చేశారని ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వం, ఇరిగేషన్ శాఖ సైతం ఇక్కడ ఎటువంటి కబ్జా లేదని తన కూతురు చెప్పిందని వెల్లడించారు. ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో తన కూతురు ఫిర్యాదు చేసిన విషయం వాస్తవమేనని ముత్తిరెడ్డి స్పష్టం చేశారు. స్వాగత్ గ్రాండ్ హోటల్ కిన్నెరగా పేరు మార్చిన తర్వాత, లీజు డిడి మార్చడం జరిగిందని.. తన కూతురు పేరు ఎక్కడ మార్చలేదని వివరించారాయన. కుటుంబంలో వచ్చిన తగాదాలను.. రాజకీయాలుగా చిత్రీకరిస్తున్నారని విమర్శించారు. తన కూతురుకు తెలియకుండా లీజు రెన్యువల్ చేశారని ఫిర్యాదు చేశారు. భూమి కబ్జాకు గురైదని కాదని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి పేర్కొన్నారు.