మచ్చ లేని లీడర్ వివేక్ వెంకటస్వామి

మచ్చ లేని లీడర్ వివేక్ వెంకటస్వామి

మల్హర్, వెలుగు : మచ్చ లేని నాయకుడు, పేద బడుగు బలహీన వర్గాల కోసం పని చేసే నాయకుడు వివేక్ వెంకటస్వామి అని మాలమహానాడు రాష్ట్ర కార్యదర్శి డా. దేవి భూమయ్య అన్నారు. చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంతో మల్హర్  కాంగ్రెస్ శ్రేణులు, కాకా ఫ్యామిలీ అభిమానులు ఆదివారం సంబురాలు నిర్వహించారు. 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం కొయ్యూరు చౌరస్తాలో పటాకులు కాల్చి, కేక్ కట్ చేసి తినిపించుకున్నారు. కార్యక్రమంలో వేల్పుల వెంకటేశ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎండీ కలీముద్దీన్, యువ నాయకులు గడ్డం ప్రేమ్ కుమార్, నవీన్, వేల్పుల శంకర్, వివేక్ అభిమానులు పాల్గొన్నారు.