
సికింద్రాబాద్, వెలుగు: సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలో 82 మంది లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పద్మారావుగౌడ్ సోమవారం పంపిణీ చేశారు. సీతాఫలమండీ క్యాంప్ఆఫీసులో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఓట్లు, రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రజలకు అండగా ఉంటున్నట్లు తెలిపారు. ఏ సమస్య ఉన్నా తనను సంప్రదించవచ్చని చెప్పారు.