ఆర్మూర్, వెలుగు : నిజాంసాగర్కాల్వల మరమ్మతుల కోసం రూ.1500 కోట్లు మంజూరు చేయాలని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి కోరారు. సోమవారం హైదరాబాద్‌లో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిజాంసాగర్‌కు సంబంధించి35 కిలోమీటర్ల మేర కాల్వలను రిపేర్లు చేయాల్సి ఉంటుందన్నారు. కాల్వల స్థలం కొంతమేర కబ్జాలకు గురికాగా, మరికొన్ని కాల్వలు చెట్లు, చెత్తాచెదారంతో నిండి ఉన్నాయన్నారు. నీరు సాఫీగా వెళ్లకపోవడం వల్ల చివరి ఆయకట్టుకు సాగునీరు అందడంలేదని మంత్రికి వివరించారు. నిధుల మంజూరుకు మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు
