పోలీసులను తిట్టిన ఘటనపై స్పందించిన ఎమ్మెల్యే రఘనందన్ రావు

పోలీసులను తిట్టిన ఘటనపై స్పందించిన ఎమ్మెల్యే రఘనందన్ రావు

పోలీసులను తిట్టిన ఘటనపై దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘనందన్ రావు స్పందించారు. ఉద్రిక్త పరిస్థితుల్లో తాను ఏం మాట్లాడానో గుర్తులేదని చెప్పారు. తాను ఏనాడు వ్యక్తిగతంగా ఎవరిని దూషించలేదని అన్నారు. ఒకవేళ తప్పుగా మాట్లాడి తన మాటలను ఉంటే విత్ డ్రా చేసుకుంటున్నానని చెప్పారు. స్వీకర్ తనకు నోటీసు పంపితే సమాధానం చెప్తానని రఘనందన్ వెల్లడించారు. ఏప్రిల్ 05న పోలీసులను ఉద్దేశించి రఘనందన్  ఘాటు వ్యాఖ్యలు చేశారు.  రాష్ట్ర డీజీపీపై దారుణ పదజాలం ఉపయోగించిన రఘనందన్ రావుపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ స్వీకర్ కు IPS అధికారుల సంఘం  ఫిర్యాదు చేసింది. పోలీసుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా రఘునందన్ వ్యాఖ్యాలు  ఉన్నాయని వెల్లడించారు. 

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని పరామర్శించడానికి వచ్చిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావును పోలీసులు ఇవాళ ఉదయం అరెస్ట్ చేశారు పోలీసులు. బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ కు వెళ్లిన ఆయనను  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరామర్శించడానికి వచ్చిన వాళ్లను అరెస్ట్ చేయడం ఏంటని, తనను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలని రఘునందన్ రావు.. పోలీసులను ప్రశ్నించారు. రఘునందన్ రావుతో పాటు మరికొందరు మహిళా బేజేపీ నేతలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు పోలీసులు.