
ఓఆర్ఆర్ అక్రమ టెండర్లపై మంత్రి కేటీఆర్ ఎందుకు స్పందించడం లేదని ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించారు. ORR కోసం ఓ కార్పోరేషన్ ను పెట్టాలని డిమాండ్ చేశారు. టెండర్ దక్కించుకున్న IRB సంస్థపై ఆరోపణలున్నాయన్నారు. లక్షకోట్ల ఆదాయం వచ్చే టెండర్లపై ఎందుకు మాట్లడటం లేదని నిలదీశారు. టెండర్ల విషయంలో ఇన్ని మోసాలు జరుగుతుంటే సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. IRB ఎక్కడిది, IRB సంస్థ ఎవరిది, ఇంత మోసం జరుగుతుంటే ఎందుకు మీరు స్పందించడం లేదని నిలదీశారు.
ORR టోల్ గేట్ పై సమీక్ష చేయడానికి సీఎం కేసీఆర్ కు టైం లేదా అని రఘునందన్ రావు ప్రశ్నించారు. ORR టెండర్ల విషయంలో HMDA అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. IRB సంస్థకు ఎందుకు వెసులుబాటు ఇస్తున్నారని.. టెండర్లు విషయంలో ప్రభుత్వం స్పందించకపోవడం వల్లే CBI దగ్గరికి వెళ్లాల్సి వచ్చిందని చెప్పారు.