కొందరు లీడర్లు రాష్ట్రంలో బీజేపీని అమ్మేశారు : ఎమ్మెల్యే రాజాసింగ్

కొందరు లీడర్లు రాష్ట్రంలో బీజేపీని అమ్మేశారు : ఎమ్మెల్యే రాజాసింగ్
  • ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపణ

హైదరాబాద్, వెలుగు:  కొందరు నాయకులు బీజేపీని అమ్మేశారని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆరోపించారు. వారు పార్టీని నిద్రపుచ్చరాని మండిపడ్డారు. రాజస్తాన్ లో బలవంతపు మత మార్పిడిపై కఠినమైన చట్టం తీసుకువచ్చిన ఆ రాష్ట్ర సీఎం భజన్ లాల్ శర్మను అభినందిస్తున్నట్టు పేర్కొన్నారు.   తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి ఉంటే అలాంటి చట్టం వచ్చేదని తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన రిలీజ్  చేశారు.

 రాజస్తాన్ ప్రభుత్వం ఇటీవల ఆమోదించిన మత మార్పిడి బిల్లు ప్రకారం.. బలవంతంగా మతం మార్చే వారికి జీవిత ఖైదు, రూ. 50 లక్షల జరిమానా విధించనున్నదని చెప్పారు. ఈ చట్టం రాజస్తాన్ లో హిందువులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ చట్టం దేశంలోనే అత్యంత కఠినమైనదని వెల్లడించారు. తెలంగాణలోనూ మతమార్పిడి, లవ్ జిహాద్, గోవధపై చట్టాలు చేయాలని డిమాండ్ చేశారు.