కేటీఆర్.. రజాకార్ సినిమా కలిసి చూద్దామా?: రాజాసింగ్

కేటీఆర్.. రజాకార్ సినిమా కలిసి చూద్దామా?: రాజాసింగ్
  •   నిజాలు తెలుసుకోకుండ మాట్లాడొద్దు: రాజాసింగ్
  •     కేటీఆర్ ట్వీట్ పై ఎమ్మెల్యే ఫైర్

హైదరాబాద్, వెలుగు : రజాకార్ సినిమా టీజర్​ను మంత్రి కేటీఆర్ విమర్శించడంపై ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. ఇందులో వాస్తవాలను తెలుసుకునేందుకు కలిసి సినిమా చూద్దామా? అని కేటీఆర్ ను కోరారు. మంగళవారం రాజాసింగ్ మీడియాకు ఒక వీడియో రిలీజ్ చేశారు. ఇందులో రజాకార్ సినిమా టీజర్ పై కేటీఆర్ చేసిన ట్వీట్ పై స్పందించారు. ‘ట్విట్టర్ మన్ కేటీఆర్.. సెన్సార్ బోర్డుకు, పోలీసులకు లేఖ రాస్తామని బెదిరిస్తున్నరు.

Also Raed : విశ్వకర్మ యోజనతో బీసీల సమగ్రాభివృద్ధి : సూర్యపల్లి శ్రీనివాస్

బీజేపీ జోకర్ కాదు.. హీరో. నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్ అరాచకాల గురించి మీ నాన్న మీకు చెప్పలేదా’ అని కేటీఆర్ ప్రశ్నించారు. ముందు మూవీ చూసి.. ఆ తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో ఆలోచిస్తే బాగుంటుందని కేటీఆర్ కు సలహా ఇచ్చారు. రజాకార్ సినిమా టీజర్ కు భయపడే నిజాం వారసులు ఏదేదో వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.

ఎంఐఎం..- బీఆర్ఎస్ కలిసి బోగస్ ఓట్లు సృష్టిస్తున్నయి

ఎంఐఎం, బీఆర్ఎస్ పార్టీలు కలిసి రాష్ట్రంలో బోగస్ ఓట్లు సృష్టిస్తున్నాయని రాజాసింగ్ ఆరోపించారు. ఒక్కో నియోజకవర్గంలో వేల సంఖ్యలో బోగస్ ఓట్లను  చేర్చేందుకు కుట్ర జరుగుతున్నదన్నారు. ఒక సెగ్మెంట్ ఓట్లు మరో సెగ్మెంట్ లోకి వెళ్తున్నాయని.. ఇతర రాష్ట్రాల వ్యక్తుల పేర్లు కూడా తెలంగాణలో నమోదు అవుతున్నాయని చెప్పారు. దీనిపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఈ దొంగ ఓట్లు ఎక్కువగా పెరుగుతున్నాయన్నారు. హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో గోషామహల్ నియోజకవర్గంలో ఓట్లు తగ్గడం.. మిగతా నియోజకవర్గాల్లో ఓట్లు పెరుగుతున్న తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు.