నెక్లెస్ రోడ్‌లో అసాంఘిక కార్యకలాపాలు పెరిగిపోతున్నాయి :రాజాసింగ్

నెక్లెస్ రోడ్‌లో అసాంఘిక కార్యకలాపాలు పెరిగిపోతున్నాయి :రాజాసింగ్

సాగర్ ను కొట్టిన వ్యక్తి ఓ రౌడీ షీటర్ 

ఉద్దేశపూర్వకంగా దాడి జరిగిందన్న ఎమ్మెల్యే రాజాసింగ్

రెండు రోజుల క్రితం హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో ప్రేమ జంట దాడిలో గాయాలపాలైన యువకుడు సాయి సాగర్ ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. గురువారం రోజున నెక్లెస్ రోడ్డు పార్కులో అసభ్యంగా ప్రవర్తిస్తున్న జంటను సాయి సాగర్ అడ్డుకున్నాడు. కోపంతో మోబిన్ జునైద్ అనే వ్యక్తి.. సాయిసాగర్ పై దాడి చేశాడు. తీవ్రగాయాలపాలై చివరకు సాయిసాగర్ మృతి చెందాడు.

జునైద్ దాడిలో గాయపడి చనిపోయిన సాయిసాగర్ కుటుంబాన్ని పరామర్శించారు ఎమ్మెల్యే రాజాసింగ్. జునైద్ అనే వ్యక్తి రౌడీషీటర్ అని, అతడిపై 12 కేసులున్నాయన్నారు. యువతితో అసభ్యంగా ప్రవర్తిస్తున్న సమయంలో ప్రశ్నించినందుకే సాయి సాగర్ పై దాడి చేశాడని అన్నారు. సాగర్ అడ్డుకున్నందునే జునైద్ అతనిపై విచక్షణా రహితంగా కొట్టాడని అన్నారు. పోలీస్ ఔట్ పోస్ట్ లో కూడా  రాయి తో సాగర్ పై జునైద్ దాడి చేశాడని అన్నారు. సాగర్ చావుకు కూడా జునైదే కారణమయ్యాడని ఎమ్మెల్యే అన్నారు. నెక్లెస్ రోడ్డులో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు పెరిగిపోతున్నాయని రాజాసింగ్ అన్నారు. ప్రేమికుల పేరుతో కొందరు బహిరంగ ప్రదేశాల్లో అసభ్యంగా ప్రవర్తిస్తూ, ఇతరులకు ఇబ్బందిని కలుగజేస్తున్నారన్నారు. ఉద్దేశ పూర్వకంగానే ఈ దాడులు జరుగుతున్నాయని, దీనిపై ప్రభుత్వాలు, పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.