
హైదరాబాద్, వెలుగు: తన భర్త, ఎమ్మెల్యే రాజాసింగ్ సస్పెన్షన్‌పై వివరణ ఇచ్చేందుకు మరికొంత సమయం ఇవ్వాలని ఆ పార్టీ కేంద్ర క్రమశిక్షణ కమిటీ మెంబర్ ఓం పాఠక్‌కు ఆయన భార్య ఉషాబాయి గురువారం మెయిల్ ద్వారా లేఖ పంపారు. ప్రస్తుతం ఆయన చర్లపల్లి జైల్లో ఉన్నారని, అందువల్ల10 రోజుల్లో షోకాజ్ నోటీసుకు వివరణ ఇవ్వలేకపోతున్నారని, మరికొన్ని వారాలు గడువు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్‌ను పార్టీ నుంచి గత నెల 23న బీజేపీ సస్పెండ్ చేసింది. దీనిపై ఈ నెల 2 లోగా వివరణ ఇవ్వాలంటూ ఆయనకు షోకాజ్ నోటీసు ఇచ్చింది.